సిరిసిల్ల కలెక్టర్ ని మెచ్చుకున్న మంత్రి కేటీఆర్.. ఎందుకంటే..?
ఇంతకీ కేటీఆర్ తో ప్రశంసలు అందుకున్న ఆ జిల్లా కలెక్టర్ ఏం చేశారు..? ఆయనను ప్రత్యేకంగా మంత్రి ఎందుకు మెచ్చుకున్నారు..? మీరే చదవండి.
గుడ్ జాబ్ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ని మెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ వేశారు. ఇంతకీ కేటీఆర్ తో ప్రశంసలు అందుకున్న ఆ జిల్లా కలెక్టర్ ఏం చేశారు..? ఆయనను ప్రత్యేకంగా మంత్రి ఎందుకు మెచ్చుకున్నారు..? మీరే చదవండి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ. దక్షిణ కాశీగా కూడా వేములవాడకు పేరుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలోని నంది జంక్షన్ ని ఇటీవల సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నంది జంక్షన్ కొత్త లుక్ అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను ట్విట్టర్లో ఉంచారు. నంది విగ్రహానికి ఓ మండపం కట్టి చుట్టూ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. పచ్చిక పెంచారు, ఓ చిన్నపాటి ఉద్యానవనంలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. చుట్టూ నర్తకీల విగ్రహాలున్నాయి. నంది జంక్షన్ కొత్త లుక్ మీకు స్వాగతం పలుకుతోంది అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వేశారు.
New look Nandi Junction welcomes you to Sri Rajarajeshwara swamy temple in Vemulawada also popularly known as Dakshina Kasi
— KTR (@KTRBRS) May 30, 2023
Good job @Collector_RSL pic.twitter.com/iGhp2W3vrz
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతోపాటు.. ఎప్పటికప్పుడు తనిఖీలతో ఆయా కార్యక్రమాల పురోగతిని కూడా పర్యవేక్షిస్తుంటారు. జిల్లా వ్యవహారాలను మంత్రి కేటీఆర్ తో చర్చించి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెడుతుంటారు. మంత్రి చొరవతో వేములవాడ రాజన్న దేవాలయ అభివృద్ధికి కూడా ఆయన పనులు మొదలు పెట్టారు. నంది జంక్షన్ ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయించారు. ఈ విషయంలోనే మంత్రి కేటీఆర్ ప్రశంసలు అందుకున్నారు కలెక్టర్ అనురాగ్.