Telugu Global
Telangana

సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం.. కేటీఆర్ ఏమన్నారంటే..!

సోషల్‌మీడియాను ఫేక్ సర్వేలు ముంచెత్తుతున్నాయి. ఫేక్‌ సర్వేలు, వార్తలు, ఫొటో ఎడిటింగ్‌లు సోషల్‌మీడియాలో విస్తృంతంగా సర్క్యూలేట్‌ అవుతున్నాయి.

సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం.. కేటీఆర్ ఏమన్నారంటే..!
X

తెలంగాణలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువుంది. ఇప్పటికే బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పోటాపోటీ ర్యాలీలు, బహిరంగ సభలతో నువ్వా-నేనా అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు సోషల్‌మీడియాలోనూ ప్రధాన పార్టీలు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

ఇదే సమయంలో సోషల్‌మీడియాను ఫేక్ సర్వేలు ముంచెత్తుతున్నాయి. ఫేక్‌ సర్వేలు, వార్తలు, ఫొటో ఎడిటింగ్‌లు సోషల్‌మీడియాలో విస్తృంతంగా సర్క్యూలేట్‌ అవుతున్నాయి. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.


ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్‌ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్‌మీడియాలో పార్టీ అభిమానులను అప్రమత్తం చేశారు. ఎన్నికలకు కొద్ది సమయమే ఉండటంతో ప్రత్యర్థులు సోషల్‌మీడియాలో తప్పుడు, డీప్‌ ఫేక్‌ వీడియోలు, అబద్ధపు ప్రచారాలతో ముంచెత్తే అవకాశం ఉందని.. అలర్ట్‌గా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కోరారు.

First Published:  24 Nov 2023 4:05 AM GMT
Next Story