మహిళా సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకోసం చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఆమె ఆకాశంలో సగం కాదని, ఆమే ఆకాశం అంటూ ట్వీట్ చేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో ఆమెకే అగ్రభాగం కేటాయించిందన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారాయన.
పుట్టిన పసిబిడ్డ నుంచి, వృద్ధురాలి వరకు అందరినీ తెలంగాణ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోందన్నారు మంత్రి కేటీఆర్. గర్భిణీలకిచ్చే న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులన్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే, ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే అని చెప్పారు కేటీఆర్. కేసిఆర్ కిట్ తోపాటు ప్రతి బాలింతకు 13వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. లక్ష్మీ కటాక్షంతోపాటు, కార్పొరేట్ కు ధీటైన గురుకులాలతో మంచి విద్యను అందిస్తూ ప్రతి ఆడబిడ్డకు సరస్వతి కటాక్షం కూడా అందిస్తున్నామని చెప్పారు.
ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం...
— KTR (@KTRBRS) June 13, 2023
సంక్షేమంలో సగం కాదు.. ”ఆమే” అగ్రభాగం...
మహిళా సంక్షేమంలో..
మన తెలంగాణ రాష్ట్రం..
యావత్ దేశానికే ఆదర్శం..
అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి...
ఆరు పదులు దాటిన అవ్వల వరకు...
అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది...
మనసున్న కేసీఅర్ సర్కార్… pic.twitter.com/yN4YacJ9Rp
ఆర్థిక ఆసరానే కాదు, సంరక్షణ కూడా..
ఆడబిడ్డలకు రక్షణ కవచంగా తెలంగాణ ప్రభుత్వం “షీటీమ్”లను ఏర్పాటు చేసిందని చెప్పారు కేటీఆర్. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు “వీహబ్” ఏర్పాటు చేశామన్నారు. స్థానికసంస్థల్లో మహిళలకు 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బతుకమ్మ పండగలకు చీరల పంపిణీ ఓ గొప్ప సంప్రదాయమన్నారు.
కల్యాణలక్ష్మి పథకం ద్వారా 10 లక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అని చెప్పారు. మిషన్ భగీరథతో మంచినీటి కష్టాలు తీర్చామని, అంగన్వాడీలు, ఆశా వర్కర్ల జీతాలు పెంచి గౌరవప్రదంగా జీవించే గొప్ప అవకాశమిచ్చామన్నారు మంత్రి కేటీఆర్. ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదు.. మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో మహిళలందరికీ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.