Telugu Global
Telangana

ఎట్లుంది..? ఎట్లైంది..? తెలంగాణ అభివృద్ధిపై కేటీఆర్ ప్రజెంటేషన్

జిల్లాలను పెంచడమే కాకుండా.. రెవెన్యూ డివిజన్లు, మున్సిపాల్టీలు, మండలాలు, గ్రామ పంచాయతీలను పెంచుకున్నామని తద్వారా పాలన మరింత సులభం అయిందని, ప్రజలకు మరింత చేరువ అయిందన్నారు. ఈ స్థాయిలో వికేంద్రీకరణ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత వేగంగా జరగలేదన్నారు కేటీఆర్.

ఎట్లుంది..? ఎట్లైంది..? తెలంగాణ అభివృద్ధిపై కేటీఆర్ ప్రజెంటేషన్
X

ఎట్లుంది తెలంగాణ, ఎట్లైంది తెలంగాణ.. అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వివిధ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధిని కళ్లకు కట్టేట్టుగా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ వీడియోల్లో కనిపిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో తెలంగాణ ఎలా ఉంది..? తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి..? అనే విషయాన్ని స్లైడ్స్ ద్వారా వివరించారు కేటీఆర్.


మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు కేటీఆర్. మిషన్‌ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని ప్రారంభించిందన్నారు. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించుకున్నామని చెప్పారు కేటీఆర్. పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేసుకున్నామన్నారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని కోరారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు అని చెప్పారు కేటీఆర్.

టీఎస్ ఐపాస్ ద్వారా 24 వేల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇచ్చామన్నారు కేటీఆర్. 4 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయని వివరించారు. 24 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించామన్నారు. ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీల‌కు హైద‌రాబాద్ చిరునామాగా మారిందని, గూగుల్, ఆపిల్, అమెజాన్, మెటా వంటి త‌దిత‌ర కంపెనీల‌కు నిల‌యంగా మారిందన్నారు. ఐటీ ఎగుమ‌తులు 57 వేల కోట్ల నుంచి 2.41 ల‌క్ష‌ల కోట్ల‌ రూపాయలకు చేరాయని వివరించారు. ఐటీ ఉద్యోగాలు 3 ల‌క్ష‌ల నుంచి 9 ల‌క్ష‌ల‌కు చేరాయని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మైంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

జిల్లాలను పెంచడమే కాకుండా.. రెవెన్యూ డివిజన్లు, మున్సిపాల్టీలు, మండలాలు, గ్రామ పంచాయతీలను పెంచుకున్నామని తద్వారా పాలన మరింత సులభం అయిందని, ప్రజలకు మరింత చేరువ అయిందన్నారు. ఈ స్థాయిలో వికేంద్రీకరణ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత వేగంగా జరగలేదన్నారు కేటీఆర్.

First Published:  23 Nov 2023 11:46 AM GMT
Next Story