Telugu Global
Telangana

రేపో మాపో పులి బయటికొస్తుంది.. కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్

కాంగ్రెస్‌ లో సీఎం అభ్యర్థి ఉన్నాడా అని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్‌ తో పోటీపడేవారు తెలంగాణలోని రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

రేపో మాపో పులి బయటికొస్తుంది.. కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్
X

కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నారని, ఇంట్లో కూర్చోని కూడా ప్రజల కోసం అన్నీ చేస్తున్నారని, త్వరలో పులిలా బయటకొస్తారని అన్నారు మంత్రి కేటీఆర్. బయటకు వచ్చి ఏం చేయాలో స్వయంగా ఆయనే చెబుతారు, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆయనకు బాగా తెలుసని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్ క్రెడిబిలిటీ ఉన్న హిస్టరీ అని, ప్రజల మీద విశ్వాసం ఉన్న నాయకుడని చెప్పారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మి ఆగం కావొద్దని సూచించారు. కాంగ్రెస్ వాళ్ళకు కర్నాటక నుంచి బీజేపీ వాళ్ళకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయని.. డబ్బులు ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలని చెప్పారు. ఆరు దశాబ్దాలుగా మోసం చేసి చావగొట్టినోడు మళ్ళీ వచ్చి ఏదో చెబితే నమ్మి మోసపోకండి అని పిలుపునిచ్చారు కేటీఆర్.

రేవంత్ రెడ్డిపై సెటైర్లు..

కాంగ్రెస్‌ లో సీఎం అభ్యర్థి ఉన్నాడా అని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్‌ తో పోటీపడేవారు తెలంగాణలోని రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్‌ వాళ్ళకు దిక్కు లేక డబ్బు సంచులతో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన సన్నాసిని పట్టుకొచ్చి పీసీసీ పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డిపై సెటైర్లు పేల్చారు కేటీఆర్. ఆ మొగోడు చెబితే మనం ఓట్లేయాలట అని అన్నారు. సోనియాను బలిదేవత, రాహుల్ ని ముద్దపప్పు అన్నది రేవంత్ రెడ్డి కాదా అని అన్నారు. రేవంత్ మాటలు నమ్ముదామా? నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ, క్రిమినల్ చేతిలో రాష్ట్రాన్ని పెడదామా? అని ప్రశ్నించారు. మొన్న ఓటుకు నోటు, ఈరోజు సీటుకో రేటు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేటెంత రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్నిపెడితే అదానీకో, అంబానీకో అమ్మేస్తారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న దరిద్రం మళ్లీ తెలంగాణకు వస్తోందని మండిపడ్డారు కేటీఆర్.

First Published:  9 Oct 2023 4:40 PM IST
Next Story