ఎక్కువ జీతాలు ఏ రాష్ట్రంలోనో తెలుసా..?
ఆ రెండు ఢిల్లీ పార్టీలు దేశమంతా కొట్టుకొని తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లు బీజేపీలో, బీజేపీలో ఉన్నోళ్లు కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్ కి పుట్టిన కవలలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగుల జీతాలు ఎక్కువ అని చెప్పారు మంత్రి హరీష్ రావు. కార్మికుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. రైల్వేలు, రైల్వే లైన్లు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను అమ్మేశారని ఆరోపించారు. అమ్మకం తప్ప కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టడం బీజేపీకి తెలియదని అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు గారు.ఈ సందర్భంగా గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుపబూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ… pic.twitter.com/sXUEC0Ifbs
— Office of Harish Rao (@HarishRaoOffice) November 14, 2023
గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు మంత్రి హరీష్ రావు. కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచిన చరిత్ర కేసీఆర్ ది అని చెప్పారు. ఆటో కార్మికులకు, రవాణా కార్మికుల ట్రాన్స్‌పోర్ట్ బోర్డు ఏర్పాటు డిమాండ్ ని అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని చెప్పారు. బీఆర్ఎస్‌ని గెలిపిస్తే ఆర్పీలు, వీఏవోల జీతాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. కనీస వేతన సవరణ కచ్చితంగా అమలు చేస్తామని, అంగన్ వాడీల సమస్యలు తీరుస్తామన్నారు.
కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా సౌకర్యం అందించబోతున్నట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఏ కారణం వల్ల అయినా ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటి మహిళకు వారం రోజుల్లో రూ.5 లక్షల బీమా డబ్బులు అందిస్తామని చెప్పారు. కేసీఆర్ ని తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతున్నాయని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల పోరే దీనికి నిదర్శనం అన్నారు హరీష్ రావు. ఆ రెండు ఢిల్లీ పార్టీలు దేశమంతా కొట్టుకొని తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయన్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లు బీజేపీలో, బీజేపీలో ఉన్నోళ్లు కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్ కి పుట్టిన కవలలని ఎద్దేవా చేశారు. మాట తప్పే కాంగ్రెస్ కావాలా, మాట మీద నిలబడే కేసీఆర్ కావాలా అని కార్మికులను ప్రశ్నించారు హరీష్ రావు.