మూడోసారి గెలిచిన వెంటనే సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి..
మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. గృహలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి.. అన్ని పథకాలు మీ ఇంటికే వచ్చాయని చెప్పారు. కొత్తగా సౌభాగ్యలక్ష్మిని తీసుకొస్తున్నామని అన్నారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాలకు మద్దతుగా ప్రచారం చేశారు మంత్రి హరీష్ రావు. పెన్షన్ 5వేల రూపాయలకు పెరగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. నిజామాబాద్ లో ఒకప్పుడు ఎండాకాలం వస్తే ట్యాంకర్లు తిరిగేవని, నీళ్లకోసం కొట్లాడుకునేవారని.. ఇప్పుడు ప్రతి ఇంటికీ ఎండాకాలంలో కూడా కుళాయి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఇవాళ ఎవరో వచ్చి మాకు ఓటువేయండి అని మిమ్మల్ని అడుగుతున్నారని, కరోనా వచ్చినప్పుడు గణేష్ బిగాల తప్ప ఇంకెవరైనా ఇక్కడ మీకు కనపడ్డారా అని ప్రశ్నించారు హరీష్ రావు. పండగలో ఉన్నాడు, దావత్ లో ఉన్నాడు, కష్టాల్లో కూడా ఎమ్మెల్యే గణేష్ బిగాల మీతోనే ఉన్నాడని చెప్పారు.
Live: Minister Sri @BRSHarish speaking at a Roadshow in Nizamabad (Urban).#KCROnceAgain#VoteForCar @GaneshBigalaMLA https://t.co/hhhNal4w91
— BRS Party (@BRSparty) November 18, 2023
మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. గృహలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి.. అన్ని పథకాలు మీ ఇంటికే వచ్చాయని చెప్పారు. కొత్తగా సౌభాగ్యలక్ష్మిని తీసుకొస్తున్నామని.. ఇంటి యజమానురాలికి 3వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు.
బీజేపీ వాళ్లు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడం మినహా, పేదలకోసం వారు ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ని 1200 రూపాయలు చేశారని మండిపడ్డారు. పేదలకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం అని చెప్పారు హరీష్ రావు. తెలంగాణ ఇచ్చింది తానేనని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజంగానే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనుకుంటే 2001లోనే ఇచ్చేదని చెప్పారు. కేసీఆర్ పోరాటాన్ని తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారన్నారు. రానే రాదన్న తెలంగాణ తేవడంతోపాటు.. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు.