మనకు మరో 20 మెడికల్ కాలేజీలు వచ్చినట్లే..
ఇప్పటికే MBBS బీ కేటగిరీ సీట్లలో 85 సీట్లను లోకల్ రిజర్వ్ చేయడంతో 1300 సీట్లు అందుబాటులోకి రాగా.. తాజాగా హైకోర్టు తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభించనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఏపీ విద్యార్థులు సవాల్ చేయగా.. తాజాగా ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పుపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు వాటిద్వారా అందుబాటులోకి వచ్చే MBBS సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని స్పష్టమైందన్నారు.
ఇప్పటికే MBBS బీ కేటగిరీ సీట్లలో 85 సీట్లను లోకల్ రిజర్వ్ చేయడంతో 1300 సీట్లు అందుబాటులోకి రాగా.. తాజాగా హైకోర్టు తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభించనున్నాయి. మొత్తం 1820 సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయని.. ఇవి దాదాపు 20 మెడికల్ కాలేజీలకు సమానమని హరీష్ రావు పేర్కొన్నారు.