ఆకలైనప్పుడు అన్నం పెట్టరు.. ఎన్నికలప్పుడు గోరుముద్దలు పెడతారంట
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బీసీ, ఎంబీసీలకు, మైనార్టీలకు మంత్రి హరీష్ రావు చెక్కులు పంపిణీ చేశారు. జీఓ 58, 59 పట్టాల పంపిణీతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఓట్ల సమయంలో గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు పేల్చారు మంత్రి హరీష్ రావు. అలాంటి గోరుముద్దల బ్యాచ్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎందుకు మంచి నీళ్లు ఇవ్వలేదని, నియామకాలు ఎందుకు చేపట్టలేదని, నాణ్యమైన విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హమీలు గుప్పించినా, డిక్లరేషన్లు చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. మోసపోతే గోస పడతారనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు హరీష్ రావు.
Hon'ble Minister Harish Rao Garu participated in an event at Gokul Gardens, Sangareddy today. Financial assistance checks of ₹1 lakh were distributed to minorities, along with monthly pensions of ₹4016 for 17,030 disabled individuals in the district. #Sangareddy pic.twitter.com/T8EhE2fmjO
— Office of Harish Rao (@HarishRaoOffice) September 16, 2023
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బీసీ, ఎంబీసీలకు, మైనార్టీలకు మంత్రి హరీష్ రావు చెక్కులు పంపిణీ చేశారు. జీఓ 58, 59 పట్టాల పంపిణీతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి ఏ ఇతర రాష్ట్రాలు కేటాయించని విధంగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కేవలం ఓట్లను లూఠీ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు.
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో మెడికల్ కాలేజీలు వచ్చాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడాదికి 10వేల మంది వైద్యులను తయారు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరువు, కష్టాలు తాండవిస్తుంటే తెలంగాణ మాత్రం కేసీఆర్ పాలనలో సుభిక్షంగా శోభిల్లుతోందన్నారు.