Telugu Global
Telangana

వైద్య‌రంగానికి రూ.13 వేల కోట్లు కేటాయించాం.. - మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి రూ. 13 వేల కోట్లు బడ్జెట్ కేటాయించామని వివ‌రించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు.

వైద్య‌రంగానికి రూ.13 వేల కోట్లు కేటాయించాం.. - మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డి
X

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతోనే ఇది సాధ్యమైందని ఆయ‌న‌ వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి రూ. 13 వేల కోట్లు బడ్జెట్ కేటాయించామని వివ‌రించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. ఒకే విడతలో చేపట్టిన నియామకాల్లో వైద్యశాఖలో 1100 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరారని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేసే ఆర్గాన్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్లు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపడుతున్నారని తెలిపారు.

కేసీఆర్ కిట్‌ను ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ప్రవేశపెడితే ఉచిత డెలివరీలు చేస్తామని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు తనకు విజ్ఞప్తి చేశాయని చెప్పారు. వైద్య రంగంలో ప్రైవేటు, ప్రభుత్వానికి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆయ‌న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ ప్రజలు అభినందిస్తున్నారని హ‌రీశ్‌రావు చెప్పారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయ‌న‌ తెలిపారు.

First Published:  3 July 2023 7:27 AM IST
Next Story