42 పేజీల మేనిఫెస్టో కాదు.. 420 మేనిఫెస్టో
జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ సరఫరాని కూడా మేనిఫెస్టో అంశంగా పెట్టారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఈ హామీలన్నిటినీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీది 42 పేజీల మేనిఫెస్టో కాదని 420 మేనిఫెస్టో అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. అమలు సాధ్యం కాని హామీలిస్తూ ఆ పార్టీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని అన్నారాయన. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఘాటుగా స్పందించారు. గెలుపు అసాధ్యమని తెలిసే, ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. పేజీలకు పేజీలు మేనిఫెస్టో రాశారని, అసలు కాంగ్రెస్ కి, ఆ పార్టీ మేనిఫెస్టోకి విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు.
గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు గారు పాల్గొన్నారు.
— Office of Harish Rao (@HarishRaoOffice) November 17, 2023
ఈ సదర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ
కాంగ్రెస్ ది 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో.
అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నది. ఎలాగూ గెలిచేది లేదని.
పేజీలకు పేజీలు… pic.twitter.com/O9DN6mSQym
జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ సరఫరాని కూడా మేనిఫెస్టో అంశంగా పెట్టారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఈ హామీలన్నిటినీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ లాంటివన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయని, అందులో సగం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నవేనని చెప్పారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు హరీష్ రావు.
మోసం చేసింది నువ్వే..
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ పై తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. అన్నం పెట్టిన కేసీఆర్ ని ఈటల మోసం చేశారన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు, ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గొప్పోడు, మంచోడు అన్న ఈటల.. పార్టీ మారగానే మాట మార్చేశారని కౌంటర్ ఇచ్చారు.