కారెక్కండి.. అనిల్‌కు హరీష్ రావు ఆహ్వానం
పార్టీ కోసం కష్టపడిన వారికి కాంగ్రెస్‌లో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇస్తామన్న హామీ తోనే 5 ఏళ్ల క్రితం పార్టీలో చేరానన్నారు.
నర్సాపూర్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గాలి అనిల్ కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. గాలి అనిల్ కుమార్ నివాసానికి వెళ్లిన హరీష్ రావు అల్పహారం చేశారు. అనిల్ కుమార్‌ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించగా.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఇవాళ నర్సాపూర్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు అనిల్ కుమార్.
నర్సాపూర్ టికెట్ ఆశించిన గాలి అనిల్ కుమార్‌కు హస్తం పార్టీ హ్యాండిచ్చింది. ఆవుల రాజిరెడ్డికి టికెట్ కేటాయించింది. బీజేపీ కోవర్ట్ అని ఆరోపిస్తూ ఆవుల రాజిరెడ్డిని మార్చాలని గాలి అనుచరులు ఆందోళన చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అనిల్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, టీపీసీసీ ఉపాధ్యక్ష పదవితో పాటు మెదక్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు.
సంగారెడ్డి - మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ ఇంటికి మంత్రి హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2023
అమీన్ పూర్ లోని గాలి అనిల్ కుమార్ నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీశ్ రావు.
నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గాలి అనిల్ కుమార్.. ఈరోజు నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభలో… pic.twitter.com/w74yarCxYl
పార్టీ కోసం కష్టపడిన వారికి కాంగ్రెస్‌లో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇస్తామన్న హామీ తోనే 5 ఏళ్ల క్రితం పార్టీలో చేరానన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు గాలి అనిల్ కుమార్. ఆ ఎన్నికల్లో 2 లక్షల 79 వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.