తెలంగాణలో కల్లుగీత కార్మికులకు లూనాలు..
గౌడల సంక్షేమానికి బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్ రావు. శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ కి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు.
తెలంగాణలో కల్లుగీత కార్మికులకు లూనాలు ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సంగారెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ని గెలిపించాలని కోరారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్ లో పడ్డారని, ఓడిపోయిన చింతా ప్రభాకర్ జనాలతోనే ఉన్నారని వివరించారు. ఈ ఐదేళ్లలో జగ్గారెడ్డి ఒక్క ఊరు కూడా తిరగలేదని విమర్శించారు. చింతా ప్రభాకర్ కి మద్దతివ్వాలని, సంగారెడ్డి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు హరీష్ రావు.
సంగారెడ్డిలో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన మంత్రి హరీశ్ రావు గారు. ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ
— Office of Harish Rao (@HarishRaoOffice) November 23, 2023
కేసీఆర్ వచ్చాక చెట్టు పన్ను రద్దు, సొసైటీ పునరుద్దరణ, ఆటోమేటిక్ రెన్యువల్ చేశాడు, నెల నెలా మామూళ్లు లేకుండా కేసీఆర్ చూస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ సాహా మరెవర్ని వారిని గౌడన్నలకు… pic.twitter.com/k7BqPRY7PE
గౌడల సంక్షేమానికి బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్ రావు. శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ కి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పని చేసే వారిని దీవించాలని విజ్ఞప్తి చేశారు. 3కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం పెడుతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాటి చెట్టుకి పన్ను రద్దు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల నెల మామూళ్లు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు హరీష్ రావు. ఎవరూ అడగక ముందే గౌడ సామాజిక వర్గానికి వైన్ షాపుల్లో 15 శాతం రిజ్వేషన్లు కల్పించామన్నారు. ఎక్సైజ్ శాఖ సహా ఎవరూ గౌడల వైపు కన్నెత్తి చూడకుండా కేసీఆర్ చేశారని గుర్తు చేశారు హరీష్ రావు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, తెలంగాణ సాధించిన కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం భద్రంగా ఉందని చెప్పారు హరీష్ రావు. సంగారెడ్డి అభివృద్ధికి తాను భరోసా ఇస్తానన్నారు. చింతా ప్రభాకర్ ని గెలిపిస్తే నియోజకవర్గంలో అన్ని పనులు తాను దగ్గరుండి చేయిస్తానన్నారు.