మనం సాధించాం.. జిల్లా, గోదావరి జలాలు, రైలు
సిద్ధిపేటకు రైలు, గోదావరి జలాలు, సిద్ధిపేట జిల్లా అనేవి గతంలో నినాదాలుగా ఉండేవని, ఇప్పుడవి నిజాలు అయ్యాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట ప్రజల కళ్లలో ఆనందం నింపాయన్నారు. సీఎం కేసీఆర్ కార్యదక్షతకు ఇదే నిదర్శనం అని చెప్పారు.
"సిద్దిపేట జిల్లా, సిద్దిపేటకు గోదావరి జలాలు, సిద్దిపేటకు రైలు.. ఇవన్నీ గతంలో సాధ్యం కాని పనులు. కానీ ఇప్పుడవి సాకారమయ్యాయి. మన కళ్ల ముందే ఆవిష్కృతం అయ్యాయి." అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట నుంచి నర్సాపూర్ స్టేషన్ వరకు నిర్వహించిన రైలు ట్రయల్ రన్ లో ఆయన పాల్గొన్నారు. రైలు ముందు సెల్ఫీ దిగి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నినాదాలనుంచి నిజాల వరకు..
సిద్ధిపేటకు రైలు, గోదావరి జలాలు, సిద్ధిపేట జిల్లా అనేవి గతంలో నినాదాలుగా ఉండేవని, ఇప్పుడవి నిజాలు అయ్యాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట ప్రజల కళ్లలో ఆనందం నింపాయన్నారు. సీఎం కేసీఆర్ కార్యదక్షతకు ఇదే నిదర్శనం అని చెప్పారు. ఇంత కంటే గొప్ప సంతృప్తి ఏం ఉంటుందని అన్నారు. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపెట్టామన్నారు మంత్రి హరీష్ రావు.
సిద్దిపేట జిల్లా, సిద్దిపేటకు గొదావరి జలాలు, సిద్దిపేటకు రైలు.. ఇవన్నీ మన కళ్ళ ముందు అవిష్కృతం అయ్యాయి.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 26, 2023
ఇంత కంటే గొప్ప సంతృప్తి ఏం ఉంటుంది. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపెట్టాము.
నినాదాలుగా ఉన్న పనులు నిజాలు అయ్యాయి. సిద్దిపేట ప్రజల కండ్లలో ఆనందం నింపాయి.
సీఎం కేసీఆర్ గారి… pic.twitter.com/D8pkhW7VkT
సిద్దిపేట నుంచి సరిపడా సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న రైల్వే అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్ పుల్ ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఈ రైలు నడుస్తుందని చెబుతున్నారు. తిరుపతి, బెంగళూరు, ముంబైకి కూడా సిద్ధిపేటనుంచి ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నాంపల్లి నుంచి మొదలయ్యే కొన్ని ఎక్స్ ప్రెస్ లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే కరీంనగర్ ప్రయాణికులకు కూడా ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద సిద్ధిపేట రైలు అనే చిరకాల కోరిక నెరవేరడంతో మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.