డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చాయా..?
తెలంగాణపై విమర్శలు చేసే బీజేపీ నాయకులు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఓసారి అంచనా వేసుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నారా అని అడిగారు. అక్కడ అంతా డబుల్ ట్రబుల్స్ రాజ్యమేలుతున్నాయని చెప్పారు.
దసరా, రంజాన్, క్రిస్మస్ మూడు పండగలు ఒకేరోజు వస్తే ఎంత సంతోషం ఉంటుందో.. ఈరోజు తెలంగాణ ప్రజలు అంత సంబర పడుతున్నారని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఒక్క రూపాయలు ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి లంచం లేకుండా 60 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పేదలకు ఉచితంగా లభించిందని, వారి సంతోషాన్ని ఎవరూ వర్ణించలేరని అన్నారు. ధనికులకే సొంతం అనుకునే ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఉచితంగా అందించడం కేవలం సీఎం కేసీఆర్ కి మాత్రమే సాధ్యమైందన్నారు హరీష్ రావు. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు లేవు?
— BRS Party (@BRSparty) September 2, 2023
- మంత్రి శ్రీ @BRSHarish.#DignityHousing pic.twitter.com/Uddlkvy64E
ఆ రాష్ట్రాల్లో లేవెందుకు..?
తెలంగాణపై విమర్శలు చేసే బీజేపీ నాయకులు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఓసారి అంచనా వేసుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నారా అని అడిగారు. అక్కడ అంతా డబుల్ ట్రబుల్స్ రాజ్యమేలుతున్నాయని చెప్పారు. ధర్నాలు చేసే పార్టీలు, స్లోగన్లు ఇచ్చే పార్టీలు జీవితంలో ఏదీ చేయలేవని.. "బీజేపీ బోల్తా జ్యాదా, కర్తా కమ్ హై" అంటూ సెటైర్లు పేల్చారు హరీష్ రావు. బీఆర్ఎస్ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తుందన్నారు. తమది స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కార్ అని పునరుద్ఘాటించారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ పేదలకోసం కడుతున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు మంత్రి హరీష్ రావు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎవరూ అమ్ముకోవద్దని, పది కాలాలపాటు వాటిని కాపాడుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వాలు కూడా ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాయని, కానీ లబ్ధిదారులపై వడ్డీ భారం వేశాయని, ఉచితంగా ఇచ్చిన ఇళ్లు నాసిరకంగా ఉండేవని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు క్వాలిటీతో ఉన్నాయన్నారు హరీష్ రావు.