విపక్షాల మాటలకు విలువలేదు.. కేసీఆర్ కి తిరుగులేదు
వాళ్లది వైట్ కాలర్ మోసం అయితే, మనది వైట్ కోట్ రెవల్యూషన్ అని చెప్పారు హరీష్ రావు. నల్లధనం బయటకు తెస్తామన్న మోదీ, ఆ నల్లధనం దాచుకున్నోళ్లను దేశం దాటించారని ఎద్దేవా చేశారు.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వైట్ కాలర్ నేరగాళ్లను దేశం దాటించిన మోదీ పాలన కావాలా..? ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ వైట్ కోట్ రెవల్యూషన్ తెచ్చిన కేసీఆర్ పాలన కావాలా..? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు. వాళ్లది వైట్ కాలర్ మోసం అయితే, మనది వైట్ కోట్ రెవల్యూషన్ అని చెప్పారు. నల్లధనం బయటకు తెస్తామన్న మోదీ, ఆ నల్లధనం దాచుకున్నోళ్లను దేశం దాటించారని ఎద్దేవా చేశారు.
➡️ తెలంగాణను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన సీఎం శ్రీ కేసీఆర్
— BRS Party (@BRSparty) October 1, 2023
➡️ విపక్షాల మాటలకు విలువ లేదు.. కేసీఆర్ గారి మాటకు తిరుగులేదు
➡️ మళ్లీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు : మంత్రి శ్రీ @BRSHarish.#KCROnceAgain #VoteForCar pic.twitter.com/HH4Zh2039z
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతోందన్నారు మంత్రి హరీష్ రావు. పాలమూరు సభ - మోదీ ప్రసంగంపై ఆయన మండిపడ్డారు. గిరిజన యూనివర్శిటీ మీరు కొత్తగా ఇచ్చేదేంటని ప్రశ్నించారు. విభజన చట్టంలో 9 ఏళ్ల క్రితమే గిరిజన యూనివర్శిటీ హామీ పెట్టారని, పార్లమెంట్ ఇచ్చిన హామీని సైతం అమలు చేయకుండా అడ్డుపడింది బీజేపీ ప్రభుత్వం అని ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా డ్రామాలాడింది బీజేపీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను బీజేపీ ఇంకా మోసం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు.
కాంగ్రెస్ పాలనలో 3గంటల కరెంట్..
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంటు 3 గంటలే ఇస్తున్నారని, తెలంగాణలో కూడా అదే చేస్తామని వారు చెబుతున్నారని, అలాంటి పాలన మనకు కావాలా అని ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో.. నల్లా లేని ఇల్లు లేదని, ట్రాక్టర్ లేని ఊరు లేదని, పల్లె ప్రకృతి వనం లేని ఊరు లేదని, డాక్టర్ లేని పి.హెచ్.సి. లేదని, పునరుద్ధరణ చేయని చెరువు లేదని, ఎండిపోయిన పంట పొలాలు కానరావని, రైతుబంధు అందని రైతు లేడని, ఆసరా పెన్షన్ అందని అవ్వాతాత లేరని, కల్యాణ లక్ష్మి అందని అక్కచెల్లెల్లు లేరని చెప్పారు. మొత్తంగా కేసీఆర్ పాలనకు తిరుగులేదని అన్నారు హరీష్ రావు.
*