బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లోనే సమాధానం
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ దే నన్నారు మంత్రి హరీష్ రావు. నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని తెలిపారు.
విమర్శించడానికి ఏమీ లేక ప్రతిపక్షాలు బూతులు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. చెప్పుతో కొట్టాలి అని నిన్న ఒక నేత అన్నాడని, బూటుతో కొట్టాలి అని మేమూ మాట్లాడలేమా? అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లోనే సమాధానం చెప్పాలని ఓటర్లను కోరారు. తెలంగాణ బిడ్డ కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటయ్యాయని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని దుయ్యబట్టారు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై కక్షసాధిస్తోందని విమర్శించారు. బషీర్ బాగ్ లో స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పంథాలో నడిపించామని వివరించారు.
Live: Minister Sri @BRSHarish speaking at Meet the Press program in Hyderabad. #KCROnceAgain #VoteForCar https://t.co/NYg1DPhv31
— BRS Party (@BRSparty) November 15, 2023
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ దే నన్నారు మంత్రి హరీష్ రావు. నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గతంలో తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో.. ప్రజలు గుండెల మీద చెయ్యి వేసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో కరవు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దామని, కేసీఆర్ విజన్ తో విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు హరీష్. విద్య, వైద్యం, విద్యుత్, హైదరాబాద్ డెవలప్ మెంట్, ఐటీ రంగాలతో పాటు అనేక అంశాలపై విజన్ తో ముందుకు వెళ్ళామని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే సంక్షేమ పథకాలు రూపొందించిందన్నారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై కూడా మంత్రి హరీష్ రావు స్పందించారు. పేపర్ లీక్ దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అని దీనిని కూడా ప్రభుత్వమే గుర్తించి సీఐడీ ఎంక్వయిరీ చేయించి నిందితులను అరెస్ట్ చేయించిందన్నారు. భవిష్యత్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏ ఏడాది ఏర్పడే ఖాళీలను అదే ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు హరీష్ రావు.