Telugu Global
Telangana

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాదే..

జమిలి ఎన్నికల పేరుతో బీజేపీ ఎన్నికల డ్రామాలకు తెరతీసిందని విమర్శించారు హరీష్ రావు. బీజేపీ ఎన్ని జమిలీలు తెచ్చినా జంబ్లింగ్‌ లు చేసినా బీఆర్ఎస్ విజయం మాత్రం ఖాయమన్నారు.

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాదే..
X

ప్రతిపక్షాల ట్రిక్కులను ఛేదించి ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ బీఆర్ఎస్ దేనని చెప్పారాయన. కొన్ని పార్టీలు డిక్లరేషన్ నాటకాలాడుతున్నాయని, కానీ తెలంగాణప్రజలు కేసీఆర్‌ ను మూడోసారి సీఎం గా చేసుకుంటామని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని చెప్పారు.

తాము పనిచేసి ప్రజల్ని ఓట్లు అడుగుతున్నామని, అభివృద్ధి కళ్లముందు చూపించి తమను ఆశీర్వదించమని అడుగుతున్నామని చెప్పారు హరీష్ రావు. ప్రతిపక్షాలు మాత్రం కల్లబొల్లి మాటలు చెప్పి, అసత్య వాగ్దానాలతో ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణలో అభివృద్ధి కొనసాగుతుందని, ఇతర పార్టీలకు అధికారం ఇస్తే ఆగమైపోతామని అన్నారు. బీఆర్ఎస్ కి అధికారం వస్తేనే రైతులకు 24 గంటలు కరెంటు వస్తుందని, ఇతరులని నమ్మితే కరెంటు కష్టాలు తప్పవని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు హరీష్ రావు. 75 వేల కోట్ల రూపాయలు రైతుబంధు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా తమదేనని చెప్పారు.

జమిలి ఓ డ్రామా..

జమిలి ఎన్నికల పేరుతో బీజేపీ ఎన్నికల డ్రామాలకు తెరతీసిందని విమర్శించారు హరీష్ రావు. బీజేపీ ఎన్ని జమిలీలు తెచ్చినా జంబ్లింగ్‌లు చేసినా బీఆర్ఎస్ విజయం మాత్రం ఖాయమన్నారు. దక్షిణభారతంపై బీజేపీ చిన్నచూపు చూస్తోందని, ఈ ప్రాంత ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తెలంగాణ వచ్చి హామీలు గుప్పిస్తున్న పార్టీలు వారి పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు.

First Published:  4 Sept 2023 6:47 PM IST
Next Story