మట్టి దీపాంతలు వాడాలని మంత్రి విజ్ఞప్తి
ఇది పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్
BY Raju Asari28 Oct 2024 2:08 PM IST
X
Raju Asari Updated On: 28 Oct 2024 2:08 PM IST
దీపావళి సందర్భంగా మట్టి తో తయారుచేసిన దీపాంతలు వాడాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు చెప్పిన మంత్రి దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టి తో తయారుచేసిన దీపాంతలు వినియోగించాలని కోరారు. ఇది పర్యావరణానికి ,ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కుల వృత్తులను కూడా రక్షించినట్లవుతుందన్నారు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోరుతున్నా మట్టితో తయారుచేసిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మనం ఎనుకటి పద్ధతుల్లో మట్టితో తయారు చేసిన వస్తువులు వాడటం వల్ల మట్టి చాయ్ కప్పులు అయినా, మట్టితో తయారుచేసిన వాటర్ బాటిల్స్ వాడుతూ కుమ్మర్లకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా అండగా నిలబడాలని ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story