Telugu Global
Telangana

రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. అసదుద్దీన్ రియాక్షన్..!

ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన పార్టీ అధిష్టానం.. అతనికి గోషామహల్‌ నుంచి మరోసారి అవకాశం కల్పించింది. దీంతో బీజేపీపై ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు అసదుద్దీన్.

రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. అసదుద్దీన్ రియాక్షన్..!
X

వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయడంపై మండిపడ్డారు MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. విద్వేషపూరిత‌ ప్రసంగాలు బీజేపీలో ప్రమోషన్‌కు మార్గాలంటూ సెటైర్లు వేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్‌ చేసిన విషయంలో రాజాసింగ్‌పై బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన పార్టీ అధిష్టానం.. అతనికి గోషామహల్‌ నుంచి మరోసారి అవకాశం కల్పించింది. దీంతో బీజేపీపై ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు అసదుద్దీన్. త్వరలోనే నూపుర్‌ శర్మకు కూడా ప్రధాని మోడీ ఆశీర్వాదం కచ్చితంగా లభిస్తుందంటూ ఎద్దేవా చేశారు.


అసలేం జరిగిందంటే.. గతేడాది ఆగస్టులో ఓ వర్గాన్ని ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయనపై భార‌తీయ జ‌న‌తా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకట‌న విడుదల చేసింది. మరోవైపు ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్‌ కామెంట్స్ చేశారంటూ ఖాదర్‌ఖాన్‌ అనే వ్యక్తి మంగళ్‌హట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాజాసింగ్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక రాజాసింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, MIM మండిపడ్డాయి. తాజాగా ఆయ‌న‌పై విధించిన‌ సస్పెన్షన్‌ను ఎత్తివేసిన కమలం పార్టీ.. రాజాసింగ్‌కు తొలిజాబితాలో అవకాశం కల్పించింది. రాజాసింగ్‌ గోషామహల్‌ స్థానం నుంచి ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించారు.

First Published:  23 Oct 2023 11:00 AM IST
Next Story