మీరు గెలిచే సీట్ల కన్నా.. నా ఎన్‌ఫీల్డ్‌కు ఉండే సీట్లే ఎక్కువ- అసదుద్దీన్
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు గెలుచుకునే సీట్ల కంటే తన రాయల్ ఎన్‌ఫీల్డ్‌కే ఎక్కువ సీట్లు ఉన్నాయంటూ సెటైర్ వేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని మరోసారి టార్గెట్ చేశారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. MIM, BRS బీజేపీకి బీ-టీమ్ అన్న రాహుల్‌గాంధీ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఓవైసీ. రాహుల్ గాంధీ నుంచి ఈ విమర్శను ముందే ఊహించానన్న అసదుద్దీన్.. అమేథి స్థానాన్ని బీజేపీకి ఎందుకు బహుమతిగా వదులుకున్నారో చెప్పాలన్నారు. తెలంగాణలో రెండు బీ-టీమ్‌లు ఉన్నప్పటికీ.. బీజేపీ ఎందుకు బలహీనంగా ఉందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎందుకు అమేథి వదిలి వయనాడ్‌కు పారిపోయారో చెప్పాలన్నారు.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు గెలుచుకునే సీట్ల కంటే తన రాయల్ ఎన్‌ఫీల్డ్‌కే ఎక్కువ సీట్లు ఉన్నాయంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు అసదుద్దీన్.
బుధవారం ములుగు జిల్లాలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, MIM కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీని ఇప్పటికే ఓడించామని.. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటుందన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని.. MIM సైతం వారితో చేతులు కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ మండిపడ్డారు.
మరోవైపు అసదుద్దీన్ ఇప్పటికే బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. MIM పోటీ చేసిన స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని.. పోటీ చేయని స్థానాల్లో ముస్లింలు బీఆర్ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు.