Telugu Global
Telangana

హైడ్రా దూకుడుతో నేతల్లో వణుకు.. రద్దుకు డిమాండ్లు

రోజూ సిటీలో ఏదో ఒక చోట అక్రమ నిర్మాణాలు నేల‌మ‌ట్టం అవుతూనే ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన బిల్డింగ్స్‌ను సైతం కూల్చివేస్తున్నారు. సిటీలోని చెరువుల్లో 66 శాతం కబ్జాకు గురైనట్లు గుర్తించామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ స్పష్టం చేశారు.

హైడ్రా దూకుడుతో నేతల్లో వణుకు.. రద్దుకు డిమాండ్లు
X

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హైదరాబాద్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన భవనాలపై ఉక్కుపాదం మోపుతోంది. అధికారులు, నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా ముందుకెళ్తోంది. హైడ్రా దూకుడుతో కబ్జాదారుల్లో భయం మొదలైంది. దీంతో ఆ వ్య‌వ‌స్థ‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఇటీవల ఓల్డ్‌ సిటీలో MIMకు చెందిన ఓ ఎమ్మెల్యే బిల్డింగ్స్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. పైనుంచి ఫోన్లు వస్తాయని బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వెనక్కి తగ్గలేదు. రోజూ సిటీలో ఏదో ఒక చోట అక్రమ నిర్మాణాలు నేల‌మ‌ట్టం అవుతూనే ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన బిల్డింగ్స్‌ను సైతం కూల్చివేస్తున్నారు. సిటీలోని చెరువుల్లో 66 శాతం కబ్జాకు గురైనట్లు గుర్తించామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు ఎవరివైనా కూల్చివేయడం మాత్రం పక్కా అన్నారు.


ఇక హైడ్రా పనితీరుతో నాయకుల్లో టెన్షన్ మొదలైంది. సిటీలో చాలా వరకు ఆక్రమణలు నేతలకు చెందినవే ఉంటాయి. దీంతో హైడ్రా స్పీడుకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే దానం నాగేందర్ బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. అధికారులు వస్తుంటారు, పోతుంటారు.. నేను లోకల్‌. హైడ్రా కమిషనర్‌పై సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేస్తానంటూ దానం చేసిన కామెంట్స్ వైరల్‌ అయ్యాయి. ఇక MIM పార్టీ సైతం హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసిన MIM నేతలు హైడ్రాను రద్దు చేయాలని వినతిపత్రం అందించారు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొని హైడ్రా ఎంతవరకు ముందుకుసాగుతుందనేది అసలు ప్రశ్న.

First Published:  15 Aug 2024 11:07 AM IST
Next Story