Telugu Global
Telangana

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో: రేపే శంఖుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

నగరంలోని మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ మెట్రో ట్రైన్ నిర్మాణం చేస్తున్నారు. మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ కు 20 నిమిషాల్లో మెట్రో చేరుకోనుంది.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో: రేపే శంఖుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
X

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో సేవలు విస్తరించేందుకు 6250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం పనులు ప్రారంభించనుంది. రేపే ఈ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

నగరంలోని మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ మెట్రో ట్రైన్ నిర్మాణం చేస్తున్నారు. మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ కు 20 నిమిషాల్లో మెట్రో చేరుకోనుంది. మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మధ్యలోని ప్రతిపాదిత స్టేషన్లు:

1.రాయదుర్గ్

2 బయో-డైవర్సిటీ జంక్షన్

3 నానక్ రాంగూడ

4 నార్సింగి

5 మంచిరేవుల

6 TS పోలీస్ అకాడమీ

7 రాజేంద్రనగర్

8 శంషాబాద్

9 ఎయిర్‌పోర్ట్ కార్గో స్టేషన్

10 RGIA టెర్మినల్

శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కేవారికి, ప్రతిపాదిత హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రాయదుర్గ్ మెట్రో స్టేషన్‌లో లగేజీ చెక్-ఇన్ సౌకర్యాన్ని అందిస్తుంది. తొలుత 8 నిమిషాల ఫ్రీక్వెన్సీలో పది మెట్రో రైల్ సర్వీసులను నడుపుతారు. అనంతరం ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించి రైళ్ళ సంఖ్యను పెంచుతారు.

First Published:  8 Dec 2022 6:01 AM GMT
Next Story