వచ్చే 5 రోజులు మరింత డేంజర్ - వాతావరణ శాఖ వార్నింగ్
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనెల 28, 29, 30 తేదీల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు చేరువవుతాయని వార్నింగ్ ఇచ్చింది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
ఇవాళ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వాడగాల్పులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిలాల్లో అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.