తెలంగాణకు 4 రోజులు వర్ష సూచన.. 12, 13 తేదీల్లో ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌లో రాబోయే నాలుగు రోజులు మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. 14, 15 తేదీల్లో సిటీలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
తెలంగాణకు మరో నాలుగు రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 15 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. ఇక సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది.
అయితే 12,13 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది. ఇక 14, 15 తేదీల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో రాబోయే నాలుగు రోజులు మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. 14, 15 తేదీల్లో సిటీలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఇక శనివారం సిటీలో మోస్తరు వర్షపాతం నమోదైంది. వికారాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది.