Telugu Global
Telangana

యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి చిరంజీవి.. బీజేపీ ఆఫర్‌ ఇదేనా..?

ఇటీవలే మెగాస్టార్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి చిరంజీవి.. బీజేపీ ఆఫర్‌ ఇదేనా..?
X

మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ పొలిటికల్ లీడ‌ర్‌గా యాక్టివ్ కాబోతున్నారా..? చిరంజీవికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందా..? అంటే అవును అనే.. ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపబోతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే.

త్వరలో దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. యూపీ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపబోతున్నారని తెలుస్తోంది.

ఇటీవలే మెగాస్టార్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి గతంలో యూపీఏ-2 హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగానూ పని చేశారు. అయితే తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు మెగాస్టార్. మరీ ఇప్పుడు చిరంజీవి పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడాలంటే మెగాస్టార్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

First Published:  30 Jan 2024 1:10 PM IST
Next Story