మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల, విషమంగానే ఆరోగ్య పరిస్థితి
ప్రీతికి నాలుగు రోజులుగా చికిత్స జరుగుతున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పటికీ ఇంకా ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్ పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులుచెప్పారు.
సీనియర్ వేధింపులు భరించలేక ఆత్నహత్యా ప్రయత్నం చేసిన వరంగల్ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై కొద్దిసేపటి క్రితం నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ప్రీతికి నాలుగు రోజులుగా చికిత్స జరుగుతున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఇప్పటికీ ఇంకా ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్ పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది.
ప్రీతి తీసుకున్న మత్తు ఇంజక్షన్ శరీరంలోని అన్ని భాగాలపై తీవ్ర ప్రభావం చూపించిందని, ముఖ్యంగా మెదడుపై తీవ్రంగా ప్రభావం పడిందని నిమ్స్ డాక్టర్లు చెప్తున్నారు. అందుకే వైద్యానికి ఆమె శరీరం ఏ మాత్రం స్పందించడం లేదు. ఈ నాలుగు రోజుల్లో ఇప్పటికే ప్రీతి గుండె మూడు సార్లు ఆగింది.వెంటనే సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్ లో న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం ప్రీతి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.