Telugu Global
Telangana

భవిష్యత్తులో అగ్నిప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు

ఖమ్మం అగ్నిప్రమాద ఘటనపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం

భవిష్యత్తులో అగ్నిప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు
X

ఖమ్మం అగ్నిప్రమాద ఘటనపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే రైతులకు, వ్యాపారాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి కచ్చితమైన నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో అగ్నిప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ. 100 కోట్లతో ఖమ్మం మార్కెట్‌ ఆధునీకరించడానికి నేడు పనులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్కెట్‌ను చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్లను అభివృద్ధి చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి కోరిక. అందుకే మార్కెట్‌కు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెద్ద మార్కెట్లకు ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి దగ్గరలో ఓఆర్‌ఆర్‌, రీజినల్‌ రింగ్ రోడ్‌ మధ్య కొత్త మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 400 ఎకరాల్లో దాన్ని ప్రారంభించాలని, ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్‌ మార్కెట్‌గా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి కోరిక అన్నారు.

First Published:  16 Jan 2025 2:16 PM IST
Next Story