Telugu Global
Telangana

కేసీఆర్‌కు పోటీగా భారీగా నామినేషన్లు.. గజ్వేల్‌లో ఎంతమందంటే..?

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలో ఉండగా.. రెండు స్థానాల్లోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

కేసీఆర్‌కు పోటీగా భారీగా నామినేషన్లు.. గజ్వేల్‌లో ఎంతమందంటే..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు శుక్ర‌వారం (10వ తేదీ) సాయంత్రానికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 119 స్థానాలకు దాదాపు 4,978 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలో ఉండగా.. రెండు స్థానాల్లోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డిలోనూ 92 మంది నామినేషన్ వేశారు. మేడ్చల్‌లో 116 మంది, ఎల్బీనగర్‌లో 77 మంది, మునుగోడులో 74 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేటలో 68, మిర్యాలగూడలో 67, నల్లగొండ నుంచి 64, సిద్దిపేటలో 62, కోదాడలో 61 మంది నామినేషన్లు ఫైల్ చేశారు.

ఇక రాష్ట్రంలోనే నారాయణపేట స్థానానికి అతితక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కేవలం 13 మంది మాత్రమే అక్కడ నామినేషన్లు దాఖలు చేశారు. తర్వాత మక్తల్‌, వైరా స్థానాలకు 19 మంది చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది.

First Published:  12 Nov 2023 3:52 AM GMT
Next Story