గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
గుజరాత్ పోర్‌బందర్‌లో సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 500 కేజీల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు.
BY Vamshi Kotas15 Nov 2024 3:45 PM IST
X
Vamshi Kotas Updated On: 15 Nov 2024 3:47 PM IST
గుజరాత్ పోర్‌బందర్‌లో సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 500 కేజీల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. ఏటీఎస్, ఎస్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ పడవలో మాదక ద్రవ్యాలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా, పట్టుబడిన డ్రగ్స్ విలువ మార్కెట్ లో రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. తాజాగా పట్టుబడిన దానితోపాటు ఇటీవల కాలంలో 1,289 కిలోగ్రాముల కొకైన్, 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. దీని మొత్తం విలువ దాదాపు రూ.13,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story