అటు మాస్, ఇటు క్లాస్.. జనం మెచ్చిన నాయకుడు కేటీఆర్
జనంలో ఉంటే మాస్ లీడర్. కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఉంటే ఆయన పక్కా క్లాస్. అటు పార్టీని, ఇటు తన పదవిని బ్యాలెన్స్ చేస్తూ కేటీఆర్ సమగ్ర నాయకుడిగా ఎదిగారు.
ఉదయం కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం.
సాయంత్రం గ్రామీణ కార్యకర్తలకు దిశా నిర్దేశం..
ఓవైపు వేలకోట్ల రూపాయల పెట్టుబడుల సమీకరణ..
మరోవైపు ఆపదలో ఉన్నవారికి సోషల్ మీడియా ద్వారా ఆపన్న హస్తం..
ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్లా..? ఒకే మనిషి ఇన్ని పనులు చేయగలరా..?
ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ బాగోగులు చూసుకుంటూ, మంత్రిగా తన శాఖలకు న్యాయం చేస్తూ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నిర్మాణాన్ని చక్కబెడుతూ.. ఇన్ని పనులు సమర్థంగా చేసే నాయకుడెవరు అంటే సమకాలీన రాజకీయాల్లో కేటీఆర్ మాత్రమే అని చెప్పాలి. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చెప్పేమాట కాదిది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయనను అభిమానిస్తున్న వారు చెప్పే నిజం ఇది.
యూకే టూర్ ముగించుకుని తెలంగాణకు వచ్చిన కేటీఆర్, హైదరాబాద్ లో ఫాక్స్ కాన్ కంపెనీకి శంకుస్థాపన చేశారు, తిరిగి వెంటనే పెట్టుబడుల వేటకోసం అమెరికా వెళ్లారు. ప్రతిష్టాత్మక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక రంగానికి దశ, దిశగా మారారు కేటీఆర్.
అటు మాస్..
అట్లుంటది మనతోని.. అంటూ సినిమా డైలాగ్ లు చెప్పడంలో కూడా మంత్రి కేటీఆర్ దిట్ట. స్టేజ్ పై సరదాగా మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేస్తూ అందర్నీ నవ్వించడంలోనూ ఆయన నేర్పరి. మీకో ముచ్చట చెబుతా.. అంటూ సభికుల్ని కట్టిపడేసే ప్రసంగాల్లోనూ కేటీఆర్ కి ఎవరూ ఎదురు లేరు. తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన లక్షణాలతోపాటు, తెలంగాణ సమాజంలో తనదైన ఇమేజ్ ని సృష్టించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు కేటీఆర్. నియోజకవర్గానికి వచ్చినా, పల్లెల్లో అడుగు పెట్టినా.. కేటీఆర్ మనలో ఒకరిగా కలసిపోతారు. మనవాడు, మనందరివాడు అనిపించుకుంటారు.
ఇటు క్లాస్..
జనంలో ఉంటే.. ఫుల్ హ్యాండ్ షర్ట్ ని రెండు మడతలు పైకి పెట్టి, చేతికి వాచీ పెట్టి చాలా సింపుల్ గా కనిపిస్తారు మంత్రి కేటీఆర్. కార్పొరేట్ దిగ్గజాల సమావేశాలయినా, విదేశీ పర్యటనలయినా ఆయన ఆహార్యం పూర్తిగా మారిపోతుంది. ప్రముఖ కంపెనీ సీఈవో లాగా ఆయన మారిపోతారు. వారిలో ఒకరుగా కనిపిస్తారు. అందుకే వివిధ కంపెనీల ప్రతినిధులు సైతం కేటీఆర్ తో చర్చలు జరిపేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు, ఆయన వ్యవహార శైలికి ముగ్ధులవుతారు, మాట తీరుకి మంత్రముగ్ధులవుతారు. ఆనంద్ మహీంద్రా అయినా, సీపీ గుర్నానీ అయినా.. కేటీఆర్ ని బహిరంగ వేదికలపై పొగడ్తలతో ముంచెత్తుతారంటే దానికి కారణం ఆయన వ్యవహార శైలి మాత్రమే.
జనంలో ఉంటే మాస్ లీడర్. కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఉంటే ఆయన పక్కా క్లాస్. అటు పార్టీని, ఇటు తన పదవిని బ్యాలెన్స్ చేస్తూ కేటీఆర్ సమగ్ర నాయకుడిగా ఎదిగారు. సహజంగా రాజకీయాల్లో వారసుల్ని నేరుగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. కానీ కేటీఆర్ అలా కాదు. తనకు తానుగా నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో జనంతో మమేకం అయ్యారు, పార్టీలో చురుకైన నేతగా మారారు. 2016 GHMC ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 99 వార్డుల ఘన విజయాన్నందించి పార్టీపై తనదైన ముద్ర వేశారు కేటీఆర్. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ మార్క్ ఎప్పటికీ చెరిగిపోదు. 2014కి ముందు ఆ తర్వాత అన్నట్టుగా హైదరాబాద్ రూపు రేఖలు మార్చడంలో, పెట్టుబడుల స్వర్గధామంగా నగరాన్ని మార్చడంలో ఆయన చొరవ తిరుగులేనిది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలతో బిజీగా ఉన్న వేళ, కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది కేటీఆర్ బలమైన నమ్మకం. దానికి తగ్గట్టుగానే యువతను సిద్ధం చేస్తూ తెలంగాణను నవపథంలో నడిపిస్తున్న జనం మెచ్చిన యువనేత కేటీఆర్.