తిరుమల అన్న ప్రసాదంలో మసాలా వడలు
శ్రీవారి భక్తులకు మసాలా వడలు అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
BY Vamshi Kotas20 Jan 2025 7:35 PM IST
X
Vamshi Kotas Updated On: 20 Jan 2025 7:36 PM IST
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మరింత రుచికర అన్న ప్రసాదాలు అందించాలని తిరుమల పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం మోనులో అదనంగా మరో ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ట్రయల్ రన్ లో భాగంగా నేడు ఐదు వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఈ మసాలా వడలు తయారు చేశారు.
కాగా, కొన్ని రోజుల పాటు పరిశీలించి, లోటుపాట్లను సవరించుకుని పూర్తి స్థాయిలో మెనూకి రూపకల్పన చేయనునున్నారు. ఈ మేరకు టీటీడీ కసరత్తులు చేస్తోంది. త్వరలోనే వడలతో కూడిన కొత్త మెనూను టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. గతంలో భక్తులకు నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చాలని నిర్ణయించారు
Next Story