Telugu Global
Telangana

కేటీఆర్‌పై మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం దావా.. రియాక్షన్ ఏంటంటే..?

మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం దావాపై తాజాగా స్పందించారు కేటీఆర్‌. మాణిక్కం ఠాగూర్‌ కన్ఫ్యూజన్‌లో ఉన్నారని.. నోటీసులను తప్పుడు చిరునామాకు పంపారని కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్‌పై మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం దావా.. రియాక్షన్ ఏంటంటే..?
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ మధ్య ట్విట్టర్‌ వార్ నడుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి మాణిక్కం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్కం ఠాగూర్‌ కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేశారు.

వారం రోజుల్లోగా కేటీఆర్ తన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాని డిమాండ్ చేశారు మాణిక్కం ఠాగూర్. లేదంటే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తరహాలోనే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఠాగూర్‌ ట్వీట్ చేశారు. ఇటీవల పరువునష్టం దావా కేసులో ఈ బీఆర్ఎస్‌ ఇద్దరు ఎమ్మెల్యేలు మధురై కోర్టుకు హాజరయ్యారు.

మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం దావాపై తాజాగా స్పందించారు కేటీఆర్‌. మాణిక్కం ఠాగూర్‌ కన్ఫ్యూజన్‌లో ఉన్నారని.. నోటీసులను తప్పుడు చిరునామాకు పంపారని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని రూ. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని కాంగ్రెస్‌ లీడర్‌, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలనే తాను కోట్ చేశానన్నారు. కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం అయ్యాయన్నారు. వెంకట్‌ రెడ్డి ఇంకా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదన్నారు కేటీఆర్. పరువు నష్టం నోటీసులను తెలంగాణ సచివాలయంలో కూర్చున్న వెంకట్‌ రెడ్డి అడ్రస్‌కు పంపాలని కోరారు కేటీఆర్. కోమటిరెడ్డి గతంలో చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వార్తను సైతం తన ట్వీట్‌లో ప్రస్తావించారు కేటీఆర్.

First Published:  31 Jan 2024 3:11 PM IST
Next Story