ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు
బాబ్రీ మసీదు విధ్వంసం గురించి డిశంబర్ 6వ తేదీన రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ పెట్టినందుకు ఆయనకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఆయనిచ్చిన జవాబు సంత్రుప్తికరంగా లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తెలంగాణ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తూ ఫేస్‌బుక్‌లో ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాబ్రీ మసీదు విధ్వంసం గురించి డిసెంబర్ 6వ తేదీన రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ పెట్టినందుకు ఆయనకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఆయనిచ్చిన జవాబు సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందుకు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని పోలీసులు రాజాసింగ్ ను అంతకు ముందు తమ నోటీసులో కోరారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆదేశించారు.
కాగా రాజాసింగ్ తన సమాధానంలో... తాను ఎవరినీ కించపర్చే , అవమానించే వ్యాఖ్యలు చేయలేదని, పోలీసులే తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులు ఆయనపై కేసు బుక్ చేశారు.
గతంలో ఆయనపై పోలీసులు విధించిన పీడీ యాక్ట్ ను రద్దు చేస్తూ హైకోర్టు పలు షరతులు విధించింది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ఇతర వర్గాలను కించపర్చే, అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని, సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు పెట్టకూడదని హైకోర్టు ఆదేశించింది.