Telugu Global
Telangana

సొంత ఇంట్లోనే దొంగతనం.. పోలీసులకు ఎలా దొరికాడంటే

ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ ఫుటేజీ చూసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. అందులో ఉన్న విజువల్స్ ప్రకారం అనిత భర్త శివే దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

సొంత ఇంట్లోనే దొంగతనం.. పోలీసులకు ఎలా దొరికాడంటే
X

సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన ఓ వ్యక్తి.. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన నిర్మల్‌ మహాదేవపూర్ కాలనీలో జరిగింది. మ్యాటర్‌లోకి వెళ్తే.. అనితా రాణి, శివ సాంబ్లే భార్యాభర్తలు. అనిత స్కూల్ టీచర్‌. శివ సాంబ్లే రోజూ ఉదయం భార్యను స్కూల్లో దింపుతాడు. సాయంత్రం తీసుకువస్తాడు. ఎప్పటిలాగే సాయంత్రం భార్యను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందర వందరగా పడున్నాయి. 8 తులాల బంగారం, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు.

పాపం అమాయకపు భార్య.. భర్త డ్రామా తెలియదు కదా. నిజంగానే చోరీ జరిగిందని నమ్మింది. భర్తతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు దొంగతనం జరిగిన ఇంటికి వచ్చి పరిశీలించారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ ఫుటేజీ చూసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. అందులో ఉన్న విజువల్స్ ప్రకారం అనిత భర్త శివే దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. శివను తీసుకువెళ్లి విచారించగా తానే చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అన్నారు పోలీసులు. ప్రతి ఒక్కరూ వారివారి అపార్ట్‌మెంట్లో, ఇళ్లల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

First Published:  22 July 2024 9:23 AM GMT
Next Story