Telugu Global
Telangana

ఉన్మాద ప్రేమికుడు దాడి.. అక్కను కాపాడబోయి తమ్ముడు మృతి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని హంతకుడు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలు సంఘవి రామాంతపూర్‌లో హోమియోపతి వైద్యురాలుగా పనిచేస్తోంది.

ఉన్మాద ప్రేమికుడు దాడి.. అక్కను కాపాడబోయి తమ్ముడు మృతి
X

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఒక యువకుడిని పొట్టనపెట్టుకున్నాడు. హత్య చేసిన వ్యక్తిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఆర్టీసీ కాలనీలో ఉంటున్న యువతి సంఘవిని కొంతకాలంగా రామాంతపూర్‌కు చెందిన శివకుమార్‌ ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమె ప్రేమను నిరాకరించడంతో ఆదివారం మూడు గంటల సమయంలో శివకుమార్‌ ఆమె ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సంఘవితో పాటు ఆమె సోదరుడు చింటూ ఇంట్లో ఉన్నాడు.

సంఘవితో మాట్లాడాలి అంటూ వచ్చిన శివకుమార్‌ కొద్దిసేపటి తర్వాత గట్టిగా అరుస్తూ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ సమయంలో అడ్డువచ్చిన చింటూపై విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు. దాడిలో సంఘవి తీవ్రంగా గాయపడింది. పై అంతస్తులు అరుపులు వినిపించడం, కిటికీ అద్దాలు పగిలిపోవడంతో స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లారు. దాడి చేసిన శివకుమార్‌ను ఇంట్లోనే బంధించారు. గాయపడిన అక్కతమ్ముడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చింటూ చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు. సంఘవి తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రితో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని హంతకుడు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలు సంఘవి రామాంతపూర్‌లో హోమియోపతి వైద్యురాలుగా పనిచేస్తోంది.


First Published:  3 Sept 2023 7:16 PM IST
Next Story