నెమలి కూర వండి యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
విషయం అటవీ అధికారుల దృష్టికి వెళ్లింది. వాళ్లు ప్రణయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్‌ని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు పెడుతున్నాడు. వెజ్‌తో పాటు నాన్ వెజ్‌ను తనే వండి ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాడు. గతంలో అడవి పంది, ముళ్ల పంది, ఉడుము మాంసాలతో వీడియోలు చేశాడు. ఈ క్రమంలోనే నెమలి కూర ఎలా వండాలో చెప్తూ వీడియో చేసి తన ఛానల్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిబంధనలకు విరుద్ధంగా నెమలితో కూర చేయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రణయ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. విషయం అటవీ అధికారుల దృష్టికి వెళ్లింది. వాళ్లు ప్రణయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్‌ని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీ టీవీ. ఇప్పటిదాకా 536 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. ఇతనికి 2 లక్షల 77వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.