Telugu Global
Telangana

మల్లారెడ్డి నామినషన్ పై ఆర్వో వివరణ.. అసలేం జరిగింది..?

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారమే మల్లారెడ్డి నామినేషన్ ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజేష్ కుమార్‌ తెలిపారు. నామినేషన్ల తర్వాత మల్లారెడ్డి విద్యార్హతలపై దాఖలైన కౌంటర్‌ అఫిడవిట్‌ పై ఆర్వో వివరణ ఇచ్చారు.

మల్లారెడ్డి నామినషన్ పై ఆర్వో వివరణ.. అసలేం జరిగింది..?
X

మంత్రి మల్లారెడ్డి నామినేషన్ విషయంలో గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి విద్యార్హతల విషయంలో వైరి వర్గాలు గొడవ చేశాయి. ఆయన అఫిడవిట్ సరికాదని ఆర్వోకి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి తాను ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్టు నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఆయన అఫిడవిట్ లో కాలేజీ పేర్లు మారిపోయాయని ఆర్వోకి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలంటూ కందడి అంజిరెడ్డి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ఆర్వో రాజేష్ కుమార్ వివరణ ఇచ్చారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారమే మల్లారెడ్డి నామినేషన్ ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజేష్ కుమార్‌ తెలిపారు. నామినేషన్ల తర్వాత మల్లారెడ్డి విద్యార్హతలపై దాఖలైన కౌంటర్‌ అఫిడవిట్‌ పై ఆర్వో వివరణ ఇచ్చారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మేడ్చల్‌ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడి సమక్షంలో జరిగిందని తెలిపారు.

రిటర్నింగ్‌ అధికారి మాన్యువల్‌ లో నిర్దేశించిన ప్రకారం అఫిడవిట్‌ ను పూర్తిగా నింపిన కారణంగా నామినేషన్‌ ను తిరస్కరించకూడదని పేర్కొన్నారు ఆర్వో. మంత్రి మల్లారెడ్డి దాఖలు చేసిన నామినేషన్లు, అఫిడవిట్లను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నోటీస్‌ బోర్డులో పెట్టినట్టు ఆర్వో తెలిపారు. ఎన్నికల కమిషన్ వైబ్‌ సైట్‌ లో కూడా వాటిని పొందుపరిచినట్టు వెల్లడించారు. ఈనెల 8వ తేదీన 2 సెట్లు, 9వతేదీ రెండు సెట్ల నామినేషన్లతోపాటు అఫిడవిట్లు ఆయన దాఖలు చేసినట్టు వివరించారు. అన్ని పరిశీలనలు పూర్తయిన తర్వాతే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ ఆమోదించినట్టు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

First Published:  15 Nov 2023 11:27 AM IST
Next Story