రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చిన్నచూపు ఉంది : ఎమ్మెల్యే వివేక్
మాలలు ఐక్యంగా ఉండి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాలల సింహగర్జనలో ఎమ్మెల్యే వివేక్ పిలుపునిచ్చారు.
మాల, మాదిగలను వేరు చెయ్యాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాలల సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. మాలలు ఐక్యంగా ఉండి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశంలో కులవివక్ష కొనసాగుతుంది చదువులో నిధుల్లో సమాన అవకాశం కల్పిచలేదన్నారు.
బాబా సాహెబ్ అంబెడ్కర్ దళితులకు ఫ్రీడమ్ కోసం పాటు పడ్డారు. కుల వివక్ష గురవుతున్నవారంత హోమోజినియస్ ఆర్టికల్ 341 చెబుతోందని వివేక్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని. పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. ఎన్నో పదవులు ఇస్తాం అంటూ ఆఫర్ వచ్చాయి. తృణపాయం గా విడిచి పెట్టాని ఆయన అన్నారు. ఈడీ దాడులు చేసిన వెనక్కి తగ్గలేదు. మీ అందరికి మేము అండగా ఉన్నాం అని వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు.