రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన
తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే హోం మంత్రిని నియమించి, శాంతి భద్రతలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తక్షణమే రాష్ట్రంలో హోం మంత్రిని నియమించి, శాంతి భద్రతలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. అంబర్‌పేట్ నియోజకవర్గ పరిధిలో సాయిబాబా నగర్‌లో ఇటీవలే వృద్ధ దంపతులు లింగారెడ్డి, ఊర్మిళ దేవి దారుణ హత్యకు గురికాగా, వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి కేటీఆర్ పరామర్శించారు. సీనియర్ సిటిజెన్స్ లింగారెడ్డి, ఊర్మిళదేవిని పట్టపగలు మర్డర్ చేయడం దారుణమని అన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్కరిని ఈ హత్యలు కలిచివేసాయన్నారు. ఆ వృద్ధ దంపతుల ముగ్గురు కుమార్తెలు బాధలో ఉన్నారని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ హయాంలో 10 లక్షలు సీసీ కెమెరాలను ఏర్పటు చేయటం జరిగిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ కేసుని పోలీసులు చేధించలేకపోయారు అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుతున్నాం ఒక్క హోం మంత్రిని నియమించండి. పోలీసులని మా మీద ఉసిగొల్పడం కాదు, అశోక్ నగర్‌లో పిల్లలు మీద దాడులు చేయించడం కాదు.. శాంతిభద్రతలను కాపాడండి. సమర్ధవంతమైన పోలీస్ అధికారులు చాలా మంది ఉన్నారు.. వారికి పవర్స్ ఇవ్వండి.. పని చేయనివ్వండి అని కేటీఆర్ సూచించారు.ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ప్రజలు ఎదురు చూడకండి. హైదరాబాద్‌లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి మీకు అండగా మేము ఉంటాము. పని చేయని సీసీ కెమెరా లును బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది. మీతో కాకపోతే మా సొంత ఖర్చులతో అయినా చేయిస్తామని కేటీఆర్ తెలిపారు.