మహారాష్ట్ర: కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించిన సర్పంచుల సంఘం
మహారాష్ట్రలోని దాదాపు 40 మంది సర్పంచులు కేసీఆర్ ప్రారంభించబోయే జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ధర్మాబాద్ తాలూకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు సురేఖ పాటిల్ హోట్టే ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీకి తమ మద్దతు ఉంటుందని మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు సురేఖ పాటిల్ హోట్టే ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం బాసరలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అంగీకార పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీకి తమ మద్దతు ఉంటుందని మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు సురేఖ పాటిల్ హోట్టే ప్రకటించారు. ఈ మేరకు ఆమె మరి కొంత మంది సర్పంచులతో కలిసి ఆదివారం బాసరలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అంగీకార పత్రాన్ని అందజేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఈ ప్రాంత రైతులు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు. మహారాష్ట్రలో రెండు నెలల్లో పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని సురేఖ పాటిల్ కేసీఆర్ ను కోరారు. తమ దగ్గర బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆమె అన్నారు