ఘోషామహల్ MLA రాజాసింగ్ పై మహారాష్ట్రలో కేసు నమోదు
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 19న జరిగిన కార్యక్రమంలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు తెలిపారు.
ఘోషామహల్ MLA రాజాసింగ్ పై మహారాష్ట్రలో పోలీసులు కేసు నమోదు చేశారు. లాతూర్ లో విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణపై ఆయనపై కేసు నమోదు చేసినట్టు మంగళవారం పోలీసులు తెలిపారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 19న జరిగిన కార్యక్రమంలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు తెలిపారు.
రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని లాతూర్ పోలీసు సూపరింటెండెంట్‌ను వివిధ సంస్థలు కోరాయని, తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే నిరసన తెలుపుతామని ఆ సంఘాలు హెచ్చరించినట్లు అధికారి తెలిపారు.
సోమవారం నగరంలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో 153ఎ కింద రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
కాగా, గత సంవత్సరం ఆగస్టులో , ఇస్లాంను, ప్రవక్త మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దీనితో బిజెపి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.