Telugu Global
Telangana

అరగంట కరెంటు పోతే కొంపలు మునిగిపోతయా?.. 15 రోజులు పెన్షన్ రాకపోతే బ్రహ్మాండం బద్ద‌లైతదా?

అరగంట కరెంట్ పోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా అని కరెంట్ కోతల్ని సమర్థించారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి. పెన్షన్ 15 రోజులు ఆలస్యమైతే బ్రహ్మాండం ఏమైనా బద్ద‌లైపోతుందా అంటూ వృద్ధుల్ని అవమానించేలా కామెంట్స్ చేశారు.

అరగంట కరెంటు పోతే కొంపలు మునిగిపోతయా?.. 15 రోజులు పెన్షన్ రాకపోతే బ్రహ్మాండం బద్ద‌లైతదా?
X

అసెంబ్లీలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కోతలు, పెన్షన్ల ఆలస్యాన్ని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. స్కిల్ వర్సిటీ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన బడ్జెట్‌లో అన్నివర్గాలకు ప్రాధాన్యం దక్కిందన్నారు. ప్రతిపేజీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేటాయింపులు చేపట్టామన్నారు. కానీ, అవేవీ ప్రతిపక్షాలకు కనిపించడం లేదని.. అరగంట కరెంట్ పోయిందని, పెన్షన్ ఆలస్యం అయిందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు ఇవా అని ప్రశ్నించారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

అరగంట కరెంట్ పోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా అని కరెంట్ కోతల్ని సమర్థించారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి. పెన్షన్ 15 రోజులు ఆలస్యమైతే బ్రహ్మాండం ఏమైనా బద్ద‌లైపోతుందా అంటూ వృద్ధుల్ని అవమానించేలా కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ కామెంట్లపై విపక్షాలు ఆగ్రహం చేస్తున్నాయి.

First Published:  1 Aug 2024 2:46 PM IST
Next Story