LPGని GST కిందికి తీసుకవచ్చినా ధరలు భారీగా ఎందుకు పెరిగాయి? -కేటీఆర్ ప్రశ్న
పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను GST కిందికి తీసుకురావాలని బిజెపి గట్టిగా వాదిస్తోంది, ఈ చర్య వల్ల ఈ ఉత్పత్తులపై పన్నులు తగ్గుతాయని ఆ పార్టీ చెప్తోంది. దీనివల్ల వినియోగదారులకి ధరలు తగ్గుతాయని బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు.అయితే, LPGని GST పరిధిలోకి తీసుకువచ్చినప్పటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.
పెట్రోల్, LPG ధరల పెరుగుదల విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పరిశ్రమల మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పంధించారు. LPGని GST పరిధిలోకి తీసుకువచ్చినప్పటికీ, గత ఎనిమిదేళ్లలో ధరలు రూ.400 నుండి రూ.1200 వరకు పెరిగాయని ఆయన మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను GST కిందికి తీసుకురావాలని బిజెపి గట్టిగా వాదిస్తోంది, ఈ చర్య వల్ల ఈ ఉత్పత్తులపై పన్నులు తగ్గుతాయని ఆ పార్టీ చెప్తోంది. దీనివల్ల వినియోగదారులకి ధరలు తగ్గుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుందని బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు.అయితే, LPGని GST పరిధిలోకి తీసుకువచ్చినప్పటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఎల్‌పిజి ధరలను నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తగ్గుతున్నప్పటికీ పెట్రో ధరలు పెరగడంలోని లోగుట్టు ఏంటో వివరించాలనికేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. మే 2014లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 107 డాలర్లు ఉండగా, పెట్రోల్ ధర లీటరుకు రూ.71గా ఉందన్నారు. అయితే, మార్చి 2023 నాటికి ముడి చమురు ధర బ్యారెల్‌కు 65 డాలర్లుగా ఉండగా, పెట్రోల్ ధర లీటరుకు రూ.110కి చేరుకుంది. "అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగగానే పెట్రో ఉత్ప్పతుల ధరలను పెంచినప్పుడు, ముడి చమురు ధరలు తగ్గినప్పుడు పెట్రో ఉత్ప్పతుల ధరలను ఎందుకు తగ్గించలేదు?" అని కేటీఆర్ అన్నారు.
ఈ అంశంపై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై బిజెపి మద్దతుదారులు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ వాదనలను తిప్పికొడుతూ, పెట్రోల్, డీజిల్‌పై మోడీ ప్రభుత్వం అత్యధిక సెస్‌లు విధించిందని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పి విష్ణువర్ధన్ రెడ్డి వాదించారు. పెట్రోల్‌పై 294%, డీజిల్‌పై 612% ఇంధన పన్నును కేంద్రం పెంచింది. 2014 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.26,51,919 కోట్లు వసూలు చేసిందని తెలిపారు.
ప్రస్తుత ముడి చమురు ధర 2014లో ఉన్నదానికంటే చాలా తక్కువగా ఉందని కూడా ఆయన ఎత్తిచూపారు. NDA ప్రభుత్వం చెల్లించిన ఆయిల్ బాండ్లు వసూలు చేసిన పన్నుల్లో కేవలం మూడు శాతం మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచలేదు. 2014కి ముందు కేంద్రం, రాష్ట్రాలు సమానంగా పన్నులు పంచుకునేవి అయితే ఇప్పుడు అది 68:32 నిష్పత్తిలో ఉంది. కేంద్రం సెస్‌ను రద్దు చేస్తే పెట్రోల్ ధరలు లీటరుకు రూ.70కి తగ్గుతాయని ఆయన ట్వీట్‌లో వాదించారు.
To those who want petroleum products to be brought under GST to curb Fuel Price Hike;
— KTR (@KTRBRS) March 20, 2023
LPG is already under GST. But the price increased from ₹400 to ₹1200 in 8 years
How can a Non performing Alliance (NPA) that cannot reel in LPG Cylinder prices be entrusted with Petroleum… https://t.co/JK4KIvBif7 pic.twitter.com/WepmqbJYTz