Telugu Global
Telangana

కుక్కలను ప్రేమించండి, వాటిని శతృవుల్లా చూడొద్దు.... అక్కినేని అమల విజ్ఞప్తి

అంబర్ పేటలో ప్రదీప్ మృతి చెందడం విచారకరమైన ఘటనే అయినప్పటికీ వేల ఏండ్లుగా కుక్కలకు , మనుషులకు మధ్య మంచి అనుబంధం ఉందని అమల అన్నారు. మనం కుక్కలను ప్రేమిస్తే అవి మనల్ని ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాయని ఆమె తెలిపారు.

కుక్కలను ప్రేమించండి, వాటిని శతృవుల్లా చూడొద్దు.... అక్కినేని అమల విజ్ఞప్తి
X

ఇటీవల హైదరాబాద్ , అంబర్ పేటలో నాలుగేళ్ళ బాలుడు ప్రదీపై కుక్కలు దాడి చేసి చంపేసిన స‍ంఘటన నేపథ్యంలో ప్రజల్లో కుక్కల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని అనేక చోట్ల ప్రతీరోజు కుక్కలు మనుషులపై దాడి చేసిన సంఘటనలు ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి. మనుషులపై ముఖ్యంగా పసివాళ్ళపై వీధికుక్కల దాడులపట్ల మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ వీధి కుక్కలను లేకుండా చేయాలని వాదిస్తుండగా, మరి కొందరు జంతు ప్రేమికులుమాత్రం కుక్కలను ప్రేమించాలని, అవి మనుషులకు అత్యంత ఆప్తులని చెప్తున్నారు. ఈక్రమంలో కుక్కలను శతృవులుగా చూడొద్దంటూ బ్లూ క్రాస్‌ సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్వాహకురాలు అక్కినేని అమల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అంబర్ పేటలో ప్రదీప్ మృతి చెందడం విచారకరమైన ఘటనే అయినప్పటికీ వేల ఏండ్లుగా కుక్కలకు , మనుషులకు మధ్య మంచి అనుబంధం ఉందని అమల అన్నారు. మనం కుక్కలను ప్రేమిస్తే అవి మనల్ని ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాయని ఆమె తెలిపారు. వీధికుక్కల సంతానం పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ సమస్యలు ఉండవని ఆమె అన్నారు.

ప్రజలు కుక్కల పట్ల ద్వేషం, కోపం పెంచుకోవద్దని, వాటిని ఆదరించి వాటి శ్రేయస్సుకు కృషి చేయాలని అమల కోరారు. అంబర్ పేట లాంటి సంఘట్నలు జరిగినప్పుడు ప్రజలకు ఆవేశం రావడం సహజమేనని కానీ వేల ఏండ్లుగా మనతో పాటు కలిసి జీవిస్తున్న కుక్కల గురించి మనం ప్రశాంతంగా ఆలోచించాలని వాటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు.

:

First Published:  1 March 2023 10:13 AM IST
Next Story