Telugu Global
Telangana

దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో

ప్రజాపాలనలో దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారన్న కేటీఆర్‌

దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో
X

ప్రస్తుతం రాష్ట్రంలో 'దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో' దందా నడుస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అక్రమార్కులు, కాంగ్రెస్‌ గ్యాంగ్‌లు చెట్టాపట్టాలేసుకొని సహజ వనరులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. చీకటి వాటాలు, సిక్రెట్‌ ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ఇసుక, మట్టిని బుక్కేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ప్రజాపాలనలో దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఇసుకాసుర.. బకాసుర.. భస్మాసుర రాజ్యం ఇది అని తీవ్రంగా మండిపడ్డారు. హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సొంతింటి కలలు కలగానే మిగిలపోతున్నాయన్నారు. కాసులపై కక్కుర్తి నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నాయని ఆరోపించారు.

'సంపద పెంచే ఆలోచనలు మావి - ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి

మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేడితిరి

నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న - పాతవి అమ్మాలన్న భయమే

నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే

నీ మూసి ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే

కాసుల పై నీ కక్కుర్తి నిర్ణయాలు - రాష్ట్రని అధోగతిపాలు చెయ్యబట్టే

నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు - నేడు విలవిలలాడుతూ బోసిపోయే

నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే

బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్బాగ్యపు పాలనకు ఇదిగో ఈ ఏప్రిల్ నుండి అక్టోబర్ లెక్కలే సాక్షాలు' అంటూ కేటీఆర్‌ మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు.

First Published:  28 Oct 2024 11:02 AM IST
Next Story