ప్రజలకు అందుబాటులో లైంగిక నేరగాళ్ళ జాబితా -కేటీఆర్
లైంగిక నేరగాళ్ళ జాబితాను తయారు చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ చేసిన ట్వీట్ కు జవాబుగా ఆయన ఈ విషయం చెప్పారు.

రోజు రోజుకు స్త్రీలపై పెరిగి పోతున్న లైంగిక దాడులను దృష్టిలో పెట్టుకొని లైంగిక నేరగాళ్ళ జాబితాను తయారు చేస్తామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ చేసిన ట్వీట్ కు ఆయన జవాబిచ్చారు.
హైదరాబాద్, బంజారాహిల్స్ లో బీఎస్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ళ బాలికపై రెండు నెలలపాటు లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో సునీతా కృష్ణన్ ట్వీట్ చేసి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ లో ఆమె అమెరికా తరహాలో ఇక్కడ కూడా లైంగిక నేరగాళ్ళ జాబితాను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.
సునితా కృష్ణన్ ట్వీట్ కు వెంటనే స్పందించిన కేటీఆర్ ''మీరు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా అమలు చేద్దాం. నేరగాళ్ళ జాబితాను తయారు చేసి నేరాల నియంత్రణకు కృషి చేద్దాం. దయచేసి దీనిపై కాన్సెప్ట్ నోట్‌ను సమర్పించండి'' అని ట్వీట్ చేశారు.
Let's absolutely get it done. Please present the concept note and we will take it forward https://t.co/upfIM1Au0W
— KTR (@KTRTRS) October 20, 2022