తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన మద్యం సరఫరా
తెలంగాణ వ్యాప్తంగా సాంకేతిక సమస్య కారణంగా మద్యం సరఫరా నిలిచిపోయింది.
తెలంగాణ వ్యాప్తంగా సర్వర్ ప్రాబ్లమ్‌తో మధ్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి లోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.మరోవైపు రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ.. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం ధరలు పెంచితే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుంది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ డబ్బు వస్తుందని సర్కార్ ఫ్లాన్. తెలంగానలో నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ ఆదాయం తోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించిన సంగతి తెలిసిందే