మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం
మరికొన్నిరోజుల్లో డ్వాక్రా మహిళలు బస్సు యజమానులుగా మారుతారన్న డిప్యూటీ సీఎం
BY Raju Asari27 Oct 2024 9:06 AM GMT
X
Raju Asari Updated On: 27 Oct 2024 9:06 AM GMT
మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. వాళ్లకు రూ. 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నాం. మరికొన్నిరోజుల్లో డ్వాక్రా మహిళలు బస్సు యజమానులుగా మారుతారు అన్నారు. వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. ఆ బస్సులను ఆర్టీసీ అద్దెకు ఇప్పిస్తామన్నారు. మహిళల భాగస్వామ్యంతో ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. వడ్డీలేని రుణాల పంపిణీ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని భట్టి తెలిపారు.
Next Story