దసరాకు ఈ ప్రతిజ్ఞ చేద్దాం
ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందామని, మద్యం తాగి వాహనం నడుపరాదని ప్రమాణం చేద్దామని మంత్రి పొన్నం పిలుపు
BY Raju Asari10 Oct 2024 10:36 AM IST
X
Raju Asari Updated On: 10 Oct 2024 10:36 AM IST
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఇందులో వాహనదారులకు పలు సూచనలు చేశారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మంత్రి తెలిపారు. దసరా చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తు. కుటుంబసభ్యులందరం కలిసి ఈ పండుగకు ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని పొన్నం పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందామని ప్రమాణం చేద్దాం. మద్యం తాగి వాహనం నడుపరాదు. ఇది ప్రమాదానికి సూచి అని పొన్నం తెలిపారు.
Next Story